: అవిలాల భూములను స్వాధీనం చేసుకోండి: చిత్తూరు కలెక్టర్ కు చంద్రబాబు ఆదేశం
ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు తిరుపతిలో ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తున్నారు. నేటి ఉదయం తిరుమల వెళ్లి వెంకటేశ్వరస్వామిని దర్శించుకున్న ఆయన నేరుగా తిరుపతి చేరుకున్నారు. నగరంలోని పలు ప్రాంతాలను పరిశీలిస్తున్న ఆయన అవిలాల చెరువు భూముల కబ్జాపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అవిలాల చెరువులో కబ్జాకు గురైన భూమిని తిరిగి స్వాధీనం చేసుకోవాలని ఆయన అక్కడికక్కడే చిత్తూరు జిల్లా కలెక్టర్ కు ఆదేశాలు జారీ చేశారు. నగరంలో ప్రజలకు మెరుగైన సౌకర్యాలు అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని ఆయన ఈ సందర్భంగా ప్రకటించారు.