: మూడవరోజు కొనసాగుతున్న మోదీ సూట్ వేలం... రూ.2 కోట్లకు చేరువలో ధర
గుజరాత్ లోని సూరత్ లో ప్రధానమంత్రి నరేంద్రమోదీ బహుమతుల వేలం మూడవ రోజు కూడా కొనసాగుతోంది. ప్రధానంగా మోదీ పూర్తి పేరును నేతలో వెయ్యిసార్లకు పైగా వచ్చేలా రూపొందించిన సూట్ కు వేలం ధర అంతకంతకూ పెరుగుతోంది. తాజాగా రెండు కోట్లకు చేరువలో వేలం వెళుతోంది. ప్రస్తుతానికి బిల్డర్ రాజేష్ జైన్ అనే వ్యక్తి రూ.1.85 కోట్లకు సూట్ ను వేలంలో కొనేందుకు ఆపర్ చేశారు. నేటి సాయంత్రంతో వేలం ముగియనుంది. దీని ద్వారా వచ్చిన నగదును గంగా ప్రక్షాళనకు ఉపయోగించనున్న సంగతి తెలిసిందే.