: అలీబాబా చీఫ్ జాక్ మా 30 ఇంటర్వ్యూల్లో ఫెయిలయ్యారట!


చైనా ఈ-టెయిలింగ్ దిగ్గజం అలీబాబా.కామ్ చీప్ లూజీ నికోల్సన్ 'జాక్ మా' చైనాలోనే అత్యంత సంపన్నుడు. భారత ఈ-టెయిలింగ్ దిగ్గజం ఫ్లిప్ కార్ట్ కు కూడా స్ఫూర్తి ఆయనే. అయితే ఉద్యోగం కోసం జాక్ మా నానా పాట్లు పడ్డారట. ఉద్యోగం కోసం కాళ్లరిగేలా తిరిగిన జాక్ మా దాదాపు 30 ఇంటర్వ్యూలకు వెళ్లారట. అయినా ఆయనకు ఉద్యోగం లభించలేదు. ఇక కళాశాల ప్రవేశ పరీక్షలోనూ ఆయన మూడుసార్లు తప్పారట. కళాశాలలో ప్రవేశం దక్కకపోవడంతో ఉద్యోగ వేటలోనూ ఆయన విజయం సాధించలేకపోయారు. పోలీసు ఉద్యోగానికెళితే, పనికిరావు పొమ్మందట చైనా పోలీసు శాఖ. చివరగా ఒక్క ప్రయత్నం చేద్దామనుకుని కేఎఫ్సీ రెస్టారెంట్ కు దరఖాస్తు చేసుకున్నారు. సదరు ఇంటర్వ్యూకు జాక్ మాతో పాటు 23 మంది హాజరయ్యారు. మిగిలిన 23 మందిని ఎంపిక చేసుకున్న కేఎఫ్సీ జాక్ మా కు మాత్రం ఉద్యోగం ఇవ్వలేదు. దీంతో 'మనకు ఇక ఉద్యోగం దొరకదు, ఏదైనా సొంతంగా చేద్దా'మనుకుని 1998లో అలీబాబాను ప్రారంభిస్తే, అక్కడా మూడేళ్ల పాటు చిల్లిగవ్వ లాభం రాలేదట. ఈ క్రమంలోనే ఈ-టెయిలింగ్ ఆలోచన వచ్చిందని ఆయన తన చరిత్రను చెప్పుకొచ్చారు. రాయిటర్స్ విలేకరికి ఇచ్చిన ఇంట్వ్యూలో ఆయన ఈ విషయాలను వెల్లడించారు. ప్రస్తుతం ఆయన ఆస్తి 20.4 బిలియన్ డాలర్లు.

  • Loading...

More Telugu News