: బీహార్ సీఎం పదవికి మాంఝీ రాజీనామా


బీహార్ ముఖ్యమంత్రి పదవికి జితన్ రామ్ మాంఝీ రాజీనామా చేశారు. బలపరీక్షలో నెగ్గలేనని తెలుసుకున్న ఆయన ఈ ఉదయం గవర్నర్ ను కలసి తన రాజీనామా లేఖను సమర్పించారు. వాస్తవానికి ఇవాళ ఆయన అసెంబ్లీలో బలపరీక్షను ఎదుర్కోవాల్సి ఉన్న సంగతి తెలిసిందే. బలపరీక్షకు వెళ్ళకుండానే ఆయన రాజీనామా చేస్తారని ముందే వార్తలు వెలువడ్డాయి. కాగా, మాంఝీ రాజీనామాతో గత కొంతకాలంగా బీహార్లో నెలకొన్న రాజ్యాంగ సంక్షోభానికి తెరపడినట్లయింది. అతి త్వరలో కొత్త సీఎంగా నితీష్ కుమార్ ప్రమాణస్వీకారం చేస్తారని సమాచారం.

  • Loading...

More Telugu News