: నన్ను నమ్మండి...యువీని మరిపిస్తా: రైనా
టీమిండియా వరల్డ్ కప్ జట్టులో యువరాజ్ సింగ్ కు చోటు కల్పించకపోవడంపై యావద్భారతం బీసీసీఐపై గుర్రుగా ఉంది. మాజీ క్రికెటర్లే కాకుండా, క్రికెట్ తెలిసిన సగటు భారతీయుడు కూడా యువీని ఎంపిక చేయకపోవడంపై విమర్శలు గుప్పించిన సంగతి తెలిసిందే. అయితే తాజా వరల్డ్ కప్ లో యువరాజ్ సింగ్ లేని లోటును మరిపిస్తానని మరో క్రికెటర్ సురేష్ రైనా పేర్కొంటున్నాడు. యువరాజ్ సింగ్ గొప్ప ఆటగాడని తెలిపిన రైనా, ఆల్ రౌండ్ ప్రదర్శనతో యువీని మరిపిస్తానని చెబుతున్నాడు. వరల్డ్ కప్ లో యువీ ప్రదర్శనే భారత్ కు కప్ ను అందించడానికి దోహదపడిందని చెప్పిన రైనా, శక్తి మేరకు రాణిస్తానని చెప్పాడు. పాక్ తో జరిగిన వన్డేలో రైనా బ్యాటింగ్, ఫీల్డింగ్, బౌలింగ్ లో రాణించిన సంగతి తెలిసిందే.