: నీరు-చెట్టు కార్యక్రమం ప్రారంభించిన చంద్రబాబు
ఏపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన కొత్త పథకం నీరు-చెట్టు పైలాన్ ను చిత్తూరు జిల్లాలో ముఖ్యమంత్రి చంద్రబాబు చేతుల మీదుగా ప్రారంభమైంది. జిల్లాలోని బీ.కొత్తపేట మండలం, గుమ్మసముద్రం గ్రామంలోని చెరువులో జేసీబీతో పూడిక తీసి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం ఉపాధి హామీ కూలీలతో ముఖాముఖి నిర్వహించారు. అంతకుముందుగా బెంగళూరు నుంచి చిత్తూరు చేరుకున్న బాబు, హెలికాప్టర్ నుంచి హంద్రినీవా కాలువ పనులను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో మంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావు, అయ్యన్నపాత్రుడు, బొజ్జల తదితరులు పాల్గొన్నారు.