: బీహార్ అసెంబ్లీలో జనతా దళ్(యూ)కు ప్రతిపక్ష హోదా!


మొన్నటివరకు అధికార పార్టీగా ఉన్న జనతాదళ్ (యునైటెడ్)కు స్పీకర్ ఉదయ్ నారాయణ చౌదరి బీహార్ రాష్ట్ర అసెంబ్లీలో ప్రధాన ప్రతిపక్ష పార్టీ హోదా ఇచ్చారు. బీహార్ ముఖ్యమంత్రి జితన్ రామ్ మాంఝీ బలపరీక్ష నిరూపించుకోబోయే 24 గంటల ముందు ఇలా ఆ హోదా ఇవ్వడం గమనార్హం. స్పీకర్ మాట్లాడుతూ, సంఖ్యాబలం తక్కువగా ఉండటంతో బీజేపీ స్థానంలో జేడీ(యూ)కి ఆ హోదా ఇచ్చినట్టు తెలిపారు. సంఖ్యా బలం ఆధారంగా ఆ పార్టీకి ప్రధాన ప్రతిపక్ష హోదా ఇచ్చామని చెప్పారు. వారి సభ్యుల సంఖ్యను పరిగణనలోకి తీసుకుని పరిశీలించామని, నిరాకరించేందుకు తమకు ఎలాంటి కారణం కనిపించలేదని స్పీకర్ పేర్కొన్నారు. ఇదిలాఉంటే స్పీకర్ నిర్ణయంపై అటు బీజేపీ నేతలు అసెంబ్లీ ఎదురుగా నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఇలా ఒకే పార్టీ అధికారంలోను, ప్రతిపక్షంలోను కూర్చోవడం దేశంలో ఇదే మొదటిసారని బీజేపీ నేత నంద కిషోర్ యాదవ్ అన్నారు.

  • Loading...

More Telugu News