: రోడ్డు ప్రమాదంలో ప్యాపిలి ఎంపీటీసీ శ్రీలత దుర్మరణం


కర్నూలు జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ప్యాపిలి ఎంపీటీసీ శ్రీలత మరణించారు. ఈ ఘటన వెల్దుర్తి మండలం బొమ్మిరెడ్డిపల్లి వద్ద జరిగింది. ఆమె ప్రయాణిస్తున్న ఆటో బోల్తా పడగా, తీవ్రగాయాలైన ఆమె మృతి చెందినట్టు సమాచారం. అతివేగమే ఈ ప్రమాదానికి కారణమని తెలుస్తోంది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సివుంది.

  • Loading...

More Telugu News