: రూ.40 కోట్లు వసూలు చేసిన 'టెంపర్'


జూనియర్ ఎన్టీఆర్ నటించిన 'టెంపర్' చిత్రం కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. మొదటి వారంలో ప్రపంచవ్యాప్తంగా రూ.40 కోట్లు వసూలు చేసింది. "ఈ సినిమా బ్లాక్ బస్టర్ అయింది. తొలివారంలో ప్రపంచవ్యాప్తంగా సుమారు రూ.40 కోట్లు వసూలు చేసింది" అని మార్కెట్ విశ్లేషకుడు త్రినాథ్ ట్వీట్ చేశారు. కాజల్ అగర్వాల్ కథానాయికగా చేసిన ఈ చిత్రాన్ని దర్శకుడు పూరీ జగన్నాథ్ తెరకెక్కించారు. ఇందులో ఎన్టీఆర్ నటనకు అభిమానులు, విమర్శకుల నుంచి అపూర్వ స్పందన వచ్చింది. వరుసగా కొన్ని సినిమాల పరాజయంతో ఉన్న జూనియర్ కు టెంపర్ మంచి బూస్టప్ ఇచ్చిందనే చెప్పాలి.

  • Loading...

More Telugu News