: బొగ్గు కుంభకోణం హిందాల్కో కేసులో దర్యాప్తు పూర్తి
దేశంలో సంచలనం సృష్టించిన బొగ్గుక్షేత్రాల కుంభకోణం హిందాల్కో కేసులో దర్యాప్తు పూర్తయిందని ప్రత్యేక కోర్టుకు సీబీఐ తెలిపింది. హిందాల్కో, ఇతరుల పాత్రపైన దర్యాప్తు ముగిసినట్టు సీబీఐ తరపు సీనియర్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ వీకే శర్మ వెల్లడించారు. ఈ కేసులో సంబంధించిన అన్ని విషయాలను, డాక్యుమెంట్లను దాఖలు చేసినట్టు కోర్టుకు వివరించారు. దానికి సంబంధించిన నివేదికను మార్చి 11న పరిగణనలోకి తీసుకుంటామని కోర్టు స్పష్టం చేసింది. గతంలో ఈ కేసులో కోర్టు ఆదేశాల ప్రకారం మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్, పీఎంవో ఉన్నతాధికారులు, సింగ్ ప్రిన్సిపల్ సెక్రటరీ టీకేఏ నాయర్, పలువురిని సీబీఐ విచారించింది.