: కిరణ్ బేడీ చెబుతున్న ఫిలాసఫీ
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి చెందిన మాజీ ఐపీఎస్ అధికారిణి, బీజేపీ నేత కిరణ్ బేడీ ఇంకా నిరాశలోనే కొట్టుమిట్టాడుతున్నారు. ఎన్నికల్లో పరాజయంపై ఆమె తనదైన ఫిలాసఫీ చెబుతున్నారు. "అసెంబ్లీ ఎన్నికల తరువాత, నువ్వు ఓడిపోయావుగా? అని సాధారణంగా అడుగుతారు. కానీ సహజంగా నా ప్రతిస్పందన - లేదు. నాకు నేనుగా విఫలమైనప్పుడే నేను ఫెయిల్ అవుతాను, మీరు నన్ను ఓడించినప్పుడు కాదు. ఇదే నా ఫిలాసఫీ" అని ఢిల్లీలో జరుగుతున్న వరల్డ్ బుక్ ఫెయిర్ లో పుస్తక విడుదల కార్యక్రమంలో పాల్గొన్న సమయంలో బేడీ పైవిధంగా మాట్లాడారు.