: సంజయ్ దత్ జైలు శిక్షకు అదనంగా మరో నాలుగు రోజులు
ప్రస్తుతం ఎరవాడ జైల్లో ఉన్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ శిక్షలో మరో నాలుగు రోజులు అదనంగా కలిసింది. అంటే తనకు సుప్రీంకోర్టు విధించిన శిక్ష పూర్తయినప్పటికీ నాలుగు రోజుల పాటు గడపాల్సి ఉంటుంది. ఈ ఏడాది జనవరి మొదటి వారంలో అదనంగా సెలవులు కావాలంటూ దరఖాస్తు చేసుకున్న సమయంలో సంజయ్ అదనంగా ఇంట్లో ఉన్నారని, అందువల్లే ఈ నిర్ణయం తీసుకున్నట్టు మహారాష్ట్ర హోంమంత్రి రామ్ షిండే తెలిపారు. కాగా సెలవు కోసం అభ్యర్థన చేసిన సమయంలో నిర్ణయం తీసుకోవడంపై అధికారులు జాప్యం చేసినందుకుగానూ విచారణకు ఆదేశిస్తామన్నారు. జనవరి 8తో సంజూ సెలవులు ముగిస్తే సూర్యాస్తమయం ముందు లొంగిపోవాల్సిందని చెప్పారు. కానీ మళ్లీ తను సెలవు దరఖాస్తు పెట్టడంతో ఇంటికి తిరిగి వెళ్లిపోయాడన్నారు. రెండు రోజుల తరువాత తన దరఖాస్తు నిరాకరించినప్పటికీ బయటే ఉన్నాడని షిండే పేర్కొన్నారు.