: విశాఖ సముద్ర జలాల్లో 'కాయ్ రాజా కాయ్'... కేసినోవా ఏర్పాటుకు విదేశీ కంపెనీ యత్నాలు
ఏపీలో అత్యంత సుందర నగరం, టూరిస్టుల డెస్టినేషన్ అయిన విశాఖపై విదేశీ కంపెనీలు దృష్టి సారిస్తున్నాయి. సముద్ర జలాల్లో అన్ని హంగులతో కూడిన ఓడను పెట్టి, అందులో కేసినోవాను నిర్వహించాలని ప్లాన్ చేస్తున్నాయి. మలేసియాకు చెందిన 'మలిందో' విమానయాన సంస్థ ఇప్పటికే విశాఖకు విమాన సర్వీసును ప్రారంభించింది. ఇదే సంస్థ తమ దేశానికే చెందిన 'జెంటింగ్' అనే కంపెనీతో కలసి, విశాఖ సముద్ర జలాల్లో ఓడను ఏర్పాటు చేసి కేసినోవా ఏర్పాటు చేయడానికి చర్చలు జరుపుతోంది. విశాఖకు సమీపంలో ఉన్న అంతర్జాతీయ జలాల్లో దీన్ని ఏర్పాటు చేస్తారు. దీంతో, స్థానిక చట్టాలు ఈ కేసినోవాకు వర్తించవు. ఇప్పటికే అమెరికాలోని పలు నగరాలకు సమీపంలో ఇలాంటి కేసినోవాలు లాభాల్లో కొనసాగుతున్నాయి. ఈ కేసినోవా వల్ల విశాఖకు కూడా ఆదాయం పెరుగుతుందని అంచనా వేస్తున్నారు.