: నందిగామ వద్ద దోపిడీ దొంగల బీభత్సం... వాహనదారులను దోచుకున్న వైనం
గుంటూరు జిల్లాలో దోపిడీ దొంగల స్వైరవిహారం నానాటికీ పెరిగిపోతోంది. ఇప్పటికే జిల్లాలోని పలు ప్రాంతాల్లో విరుచుకుపడ్డ దొంగలు తాజాగా రాత్రి నందిగామ వద్ద బీభత్సం సృష్టించారు. నందిగామ సమీపంలో జాతీయ రహదారిపై దారి కాచిన దొంగలు వాహనాలపై రాళ్లు రువ్వారు. కనిపించిన వాహనాలను ఆపేసి అందులోని వాహదారుల వద్దనున్న నగలు, నగదును అపహరించుకుని వెళ్లారు. దోపిడీ దొంగల దాడితో హడలెత్తిపోయిన వాహనాదారులు ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధితుల ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు దోపిడీ దొంగల కోసం గాలింపు చేపట్టారు.