: ‘ఆర్మీ’రిక్రూట్ మెంట్ లో తోపులాట... శ్రీకాకుళంలో నిరుద్యోగులకు గాయాలు
శ్రీకాకుళంలో జరుగుతున్న ఆర్మీ రిక్రూట్ మెంట్ లో నేటి ఉదయం తోపులాట జరిగింది. భారత సైన్యంలోని పలు విభాగాల్లో ఖాళీల భర్తీ కోసం నిర్వహిస్తున్న ఆర్మీ రిక్రూట్ మెంట్ ర్యాలీకి నేటి ఉదయం భారీ సంఖ్యలో నిరుద్యోగులు తరలివచ్చారు. ఈ సందర్భంగా నగరంలోని ఆర్ట్స్ కళాశాల వద్ద టెకెన్ల కోసం అభ్యర్థులు ఎగబడ్డారు. దీంతో జరిగిన తోపులాటలో పలువురు యువకులు కిందపడి గాయపడ్డారు. టోకెన్ల జారీ కేంద్రం వద్ద యువకులను నియంత్రించడంలో పోలీసులు విఫలమైన కారణంగానే ఈ ప్రమాదం చోటుచేసుకుంది.