: స్టార్ టీవీ యాడ్స్... టీమిండియా మ్యాచ్ లను హీటెక్కిస్తున్నాయి!


వరల్డ్ కప్ మెగా టోర్నీ ప్రసార హక్కులను చేజిక్కించుకున్న స్టార్ టీవీ, వాణిజ్య ప్రకటనల పేరిట క్రికెట్ అభిమానులను ఆకట్టుకుంటోంది. ఒక్కో మ్యాచ్ కు ఒక్కో రీతిన యాడ్ ను ప్రసారం చేస్తున్న స్టార్ టీవీ తన ప్రత్యేకతను చాటుకుంటోంది. ప్రధాన జట్ల మధ్య జరుగుతున్న మ్యాచ్ లపై ఆ టీవీ ప్రసారం చేస్తున్న యాడ్స్ వివాదాస్పదం కూడా అవుతున్నాయి. ఇక టీమిండియా ఆడుతున్న మ్యాచ్ లకు సంబంధించి ఆ టీవీ ప్రసారం చేస్తున్న యాడ్ లు వీక్షకుల్లో వేడి పుట్టిస్తున్నాయి. భారత్-పాక్ మ్యాచ్ సందర్భంగా విడుదల చేసిన యాడ్ లో... పాక్ గెలుస్తుందని భావించిన అభిమానులు సంబరాలు చేసుకునేలోగానే, ఆ దేశ జట్టు ఓడిపోవడం, అభిమాని నిరాశలో కూరుకుపోతాడు. ఇక సంబరాల కోసం సిద్ధం చేసుకున్న టపాసులకు బూజు పట్టినట్టుగా స్టార్ టీవీ చూపింది. దీనిపై కొందరు క్రికెట్ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మ్యాచ్ జరుగుతుండగానే సదరు యాడ్ ను ఎలా ప్రసారం చేస్తారంటూ ‘స్టార్’తీరును ప్రశ్నించారు. తాజాగా దక్షిణాఫ్రికాతో టీమిండియా మ్యాచ్ కోసం మరో రకమైన యాడ్ ను స్టార్ రూపొందించింది. ఇందులో సఫారీల డ్రెస్ వేసుకున్న ఇద్దరు దక్షిణాఫ్రికా వాసులు, మ్యాచ్ ను ఆసక్తిగా తిలకిస్తున్న భారత జట్టు అభిమానులకు టపాసులు అందజేస్తారు. ఆ తర్వాత ‘మోకా, మోకా’ అంటూ వెళ్లిపోతారు. వరల్డ్ కప్ లో భారత్, ఇప్పటిదాదా సఫారీపై విజయం సాధించలేదు. మ్యాచ్ జరగలేదు కాబట్టి, ఈ యాడ్ రెండు అర్థాలు ఇచ్చేలా ఉంది. దీనిపై భారత క్రికెట్ అభిమానులు అసహనానికి గురవుతున్నారు.

  • Loading...

More Telugu News