: మధ్యాహ్నం 2:30కి నాన్నగారు మమ్మల్ని వదిలి వెళ్లిపోయారు: వెంకటేష్
ఈ రోజు మధ్యాహ్నం 2:30 గంటలకు నాన్నగారు తమను వదిలి, వెళ్లిపోయారని ప్రముఖ నటుడు వెంకటేష్ తెలిపారు. రామానాయుడు నివాసం వద్ద ఆయన మాట్లాడుతూ, నాన్నగారు చాలా ప్రశాంతంగా తనువు చాలించారని అన్నారు. రేపు ఉదయం 9 గంటల తరువాత రామానాయుడు స్టూడియోస్ లో ఆయన పార్థివదేహాన్ని అభిమానుల సందర్శనార్థం ఉంచుతామని ఆయన చెప్పారు. అనంతరం మధ్యాహ్నం 3 గంటల తరువాత అంత్యక్రియలు నిర్వహిస్తామని వెల్లడించారు. కాగా, రామానాయుడు నివాసానికి సినీ, రాజకీయ, పారిశ్రామిక ప్రముఖులు చేరుకుంటున్నారు.