: రాజీనామా చేసిన పాక్ ఫీల్డింగ్ కోచ్... కారణం అఫ్రిదేనా?
పాకిస్థాన్ క్రికెట్ జట్టుకు కోచింగ్ బాధ్యతలు నిర్వర్తించాలంటే ఇన్నాళ్లు టెర్రరిజం నేపథ్యంలో భద్రత గురించి భయపడేవాళ్లు. ఇప్పుడు ఆటగాళ్లే భయపెడుతున్నారు. జట్టు ఫీల్డింగ్ కోచ్ గ్రాంట్ లూడెన్ తో అఫ్రిది, అక్మల్, షేజాద్ తదితరులు దురుసుగా ప్రవర్తించారు. మంగళవారం నాటి ప్రాక్టీసు సెషన్లో ఈ ఘటన జరిగింది. దీంతో, లూడెన్ మనస్తాపం చెంది పదవికి రాజీనామా చేశారు. ఈ వివాదానికి స్టార్ ఆల్ రౌండర్ అఫ్రిదీనే ముఖ్య కారకుడని సమాచారం. గత ఏడాది మేలో బంగ్లాదేశ్ జట్టు ఫీల్డింగ్ కోచ్ బాధ్యతల నుంచి తప్పుకున్నాక, పాక్ జట్టుతో రెండేళ్లు పనిచేేసేందుకు ఒప్పందం కుదుర్చుకున్నాడు.