: ఆఫ్ఘన్ ఆదిలోనే విలవిల... 3 పరుగులకే 3 వికెట్లు డౌన్
కాన్ బెర్రాలో జరుగుతున్న వరల్డ్ కప్ లో 268 పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన ఆఫ్ఘనిస్తాన్ జట్టుకు ఆదిలోనే ఎదురుదెబ్బలు తగిలాయి. బంగ్లాదేశ్ పేసర్ల ధాటికి 3 పరుగులకే 3 వికెట్లు కోల్పోయింది. ఓపెనర్ జావెద్ అహ్మది (1) తొలి ఓవర్లోనే వెనుదిరిగాడు. ఈ వికెట్ మొర్తాజా ఖాతాలో చేరింది. ఆ తర్వాతి ఓవర్లోనే మరో ఓపెనర్ అఫ్సర్ జాజాయ్ (1) వికెట్ పడింది. రూబెల్ హుస్సేన్ ఈ వికెట్ తీశాడు. తర్వాతి ఓవర్లో మొర్తజా మరోసారి చెలరేగి అస్ఘర్ స్తానిక్జాయ్ (1) వికెట్ తీయడంతో ఆఫ్ఘన్ మూడో వికెట్ చేజార్చుకుంది.