: వెంకన్నకు సుప్రభాత సేవ ఆలస్యం... సిబ్బందిపై ఈవో ఆగ్రహం, విచారణకు ఆదేశం


తిరుమల వెంకన్నకు నిత్యం జరుగుతున్న సుప్రభాత సేవ నేడు బాగా ఆలస్యమైంది. దీంతో సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఈవో సాంబశివరావు జాప్యంపై విచారణకు ఆదేశించారు. నేటి ఉదయం శ్రీలంక అధ్యక్షుడు మైత్రిపాల సిరిసేన కుటుంబం వెంకన్న సుప్రభాత సేవలో పాల్గొంది. అయితే రోజు మాదిరిగా కాకుండా కాస్త ఆలస్యంగా సేవ ప్రారంభమైంది. సమాచారం అందుకున్న ఈవో, ఆలస్యానికి కారణాలపై ఆరా తీశారు. జాప్యానికి దారి తీసిన కారణాలను నిగ్గు తేల్చేందుకు ఆయన విజిలెన్స్ విచారణకు ఆదేశాలు జారీ చేశారు.

  • Loading...

More Telugu News