: విజయనగరంలో గిరిజన వర్సిటీ ఏర్పాటుకు కేంద్రం సుముఖం: ఏపీ మంత్రి నారాయణ


విజయనగరం జిల్లాలో గిరిజన విశ్వ విద్యాలయాన్ని ఏర్పాటు చేసేందుకు కేంద్రం పచ్చజెండా ఊపిందని ఏపీ పురపాలక శాఖ మంత్రి నారాయణ అన్నారు. నేడు రాష్ట్రానికి వచ్చిన కేంద్ర బృందాన్ని ఆయన విజయనగరం జిల్లాలోని గుంకలం పరిసర ప్రాంతాలకు తీసుకెళ్లారు. గుంకలంలోని భూములను పరిశీలించిన కేంద్ర బృందం, వర్సిటీ ఏర్పాటుకు సదరు భూములు అనుకూలంగా ఉన్నాయని చెప్పిందని ఆయన తెలిపారు. కేంద్ర బృందం సంతృప్తి వ్యక్తం చేసిన నేపథ్యంలో త్వరలోనే వర్సిటీ ఏర్పాటుకు సంబంధించిన చర్యలను ప్రారంభించనున్నామని ఆయన వెల్లడించారు.

  • Loading...

More Telugu News