: ఏపీకి ప్రత్యేక హోదాపై కేంద్రం కుంటి సాకులు... బాబు ఒత్తిడి చేయడం లేదంటున్న రఘువీరా


రాష్ట్ర పునర్విభజన చట్టం ప్రకారం ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వడానికి కేంద్రానికి వచ్చిన ఇబ్బందేమీ లేదని ఏపీసీసీ చీఫ్ రఘువీరారెడ్డి అన్నారు. ఏపీకి ప్రత్యేక హోదాపై కుంటి సాకులు చెబుతున్న నరేంద్ర మోదీ సర్కారు ఎప్పటికప్పుడు దాటవేత ధోరణిని అవలంబిస్తోందని ఆయన కొద్దిసేపటి క్రితం ఆరోపించారు. కుంటి సాకులు చెబుతున్న కేంద్రంపై ఏపీ సీఎం చంద్రబాబునాయుడు ఒత్తిడి తేవడం లేదని కూడా రఘువీరా ఆరోపించారు. చంద్రబాబు ఏ మాత్రం ఒత్తిడి చేసినా ఏపీకి ప్రత్యేక హోదా ఇచ్చేందుకు కేంద్రం సిద్ధంగానే ఉందని ఆయన పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News