: చర్చిలపై దాడులు గర్హనీయం... అన్ని మతాలను కలిపేసుకునే గొప్ప చరిత్ర భారత్ సొంతం: ప్రధాని మోదీ


దేశ రాజధాని ఢిల్లీలో ఇటీవల క్రైస్తవుల ప్రార్థనాలయాలు చర్చిలపై జరిగిన దాడులను ప్రధాని నరేంద్ర మోదీ తీవ్రంగా ఖండించారు. అన్ని మతాలను తనలో కలిపేసుకోవడంలో దేశానికి ఘన చరిత్ర ఉందని ఆయన కొద్దిసేపటి క్రితం వ్యాఖ్యానించారు. దేశంలో అన్ని మతాలకు తమ ప్రభుత్వం సమ ప్రాధాన్యమిస్తుందని ఆయన ప్రకటించారు. దేశంలో ఎవరు ఏ మతాన్నైనా స్వీకరించే, ఆచరించే పూర్తి స్వేచ్ఛ ఉందన్నారు. దేశంలో మత హింస, విద్వేషాలను ఎంతమాత్రం సహించేది లేదని మోదీ తేల్చిచెప్పారు.

  • Loading...

More Telugu News