: ఏపీ సర్కారు తరపున అమితాబ్ ప్రచారం!


ప్రసూతి, శిశు మరణాలపై ప్రజల్లో చైతన్యం కలిగించేందుకు తాము నిర్వహించబోయే ప్రచారంలో బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ ను రంగంలోకి దింపేందుకు ఏపీ సర్కారు ప్రయత్నిస్తోంది. వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ మాట్లాడుతూ, ఆరోగ్యశాఖ ప్రధాన కార్యదర్శి వచ్చే వారంలో ముంబయి వెళ్లి దీనిపై అమితాబ్ తో చర్చిస్తారని, ఆయన అంగీకరిస్తారని భావిస్తున్నామని తెలిపారు. అమితాబ్ ఇప్పటికే కేంద్ర, ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన పలు పథకాలకు ప్రచారకర్తగా వ్యవహరిస్తున్నారు.

  • Loading...

More Telugu News