: స్టెయిన్ తో జాగ్రత్త సుమీ!: టీమిండియాకు సచిన్ సూచన


వరల్డ్ కప్ లో టీమిండియా తన తదుపరి మ్యాచ్ ను దక్షిణాఫ్రికాతో ఈ నెల 22న ఆడనుంది. ఈ మ్యాచ్ లో సఫారీ పేసర్ డేల్ స్టెయిన్ ను ఎదుర్కొనేటప్పుడు అప్రమత్తంగా ఉండాలని బ్యాటింగ్ ఐకాన్ సచిన్ టెండూల్కర్ టీమిండియా బ్యాట్స్ మెన్ కు సూచించాడు. 'స్టెయిన్ ను ఇలా ఎదుర్కోవాలి' అంటూ ముందే ప్లాన్ చేసుకోలేమని, అతని అమ్ములపొదిలో ఎన్నోరకాల అస్త్రాలు ఉంటాయని తెలిపాడు. అయితే, స్టెయిన్ అంతటివాడికి కూడా చెడ్డరోజంటూ ఉంటుందని, అయినాగానీ, అతడి బౌలింగ్ ను ఆచితూచి ఆడడం ఉత్తమమని సలహా ఇచ్చాడు. పాకిస్థాన్ తో మ్యాచ్ లో అనుసరించిన బ్యాటింగ్ ఆర్డర్ లో మార్పులు చేయాల్సిన అవసరం లేదని సచిన్ అభిప్రాయపడ్డాడు. ఇక, విరాట్ కోహ్లీ కసిగా ఆడుతున్నాడని కితాబిచ్చాడు. బౌలర్లు సరైన సమయంలో రాణించారని ప్రశంసించాడు.

  • Loading...

More Telugu News