: అలాంటి వ్యాఖ్యలతో ప్రధానిని కష్టాల్లో పడేయవద్దు: వీహెచ్ పీ అంతర్జాతీయ విభాగం అధ్యక్షుడు


కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత హిందుత్వ సంఘాలు, నేతలు ఇష్టం వచ్చినట్టుగా వ్యాఖ్యలు చేయడాన్ని విశ్వహిందూ పరిషత్ (వీహెచ్ పీ) అంతర్జాతీయ విభాగం అధ్యక్షుడు రాఘవ్ రెడ్డి తప్పుబట్టారు. అలాంటి వ్యాఖ్యలు చేసి ప్రధాని నరేంద్ర మోదీని కష్టాల్లో పడేయవద్దని సూచించారు. పంజాబ్ లోని లుథియానా సమీపంలో ఓ సమావేశంలో మాట్లాడుతూ, "చాన్నాళ్ల తర్వాత హిందూ విశ్వాసాలు, సంస్కృతి వికాసానికి తగిన ప్రభుత్వం కేంద్రంలో కొలువుదీరింది. ఇలాంటి సమయంలో హిందుత్వ వాదులు తీవ్ర వ్యాఖ్యలు చేయడం సరికాదు. సంయమనం పాటించాలి. మోదీని పనిచేయనిద్దాం... ఆయనకు సమయమిద్దాం. రానున్న రోజుల్లో 'భారతీయత' స్వప్నాన్ని మోదీ సాకారం చేస్తారు" అని పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News