: తిరుపతి ఉప ఎన్నిక తొలి రౌండ్ కౌంటింగు పూర్తి... 6,315 ఓట్ల ఆధిక్యంలో టీడీపీ అభ్యర్థి
తిరుపతి అసెంబ్లీకి జరిగిన ఉప ఎన్నికలో ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. నగరంలోని ఎస్వీ ఆర్ట్స్ కళాశాలలో జరుగుతున్న కౌంటింగులో కొద్దిసేపటి క్రితం తొలి రౌండ్ పూర్తైంది. ఈ రౌండులో టీడీపీ అభ్యర్థి సుగుణమ్మ కాంగ్రెస్ అభ్యర్థి శ్రీదేవిపై 6,315 ఓట్ల ఆధిక్యాన్ని సాధించారు. టీడీపీ నేత వెంకటరమణ అకాల మరణంతో జరిగిన ఈ ఉప ఎన్నికలో టీడీపీ అభ్యర్థిగా ఆయన సతీమణి సుగుణమ్మ బరిలోకి దిగగా, ఇప్పటిదాకా కొనసాగుతున్న సంప్రదాయాన్ని తోసిరాజని కాంగ్రెస్ పార్టీ తన అభ్యర్థిని పోటికి దింపిన సంగతి తెలిసిందే.