: ఏపీకి నిధులు వచ్చేందుకు కృషి చేస్తా: జగన్
విపక్ష నేతగా ఏపీకి నిధులు తెచ్చేందుకు ప్రయత్నిస్తానని వైఎస్సార్సీపీ అధినేత జగన్ అన్నారు. ఆయన నేడు ఢిల్లీలో కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీని కలిశారు. బడ్జెట్ లో ఏపీకి ఎక్కువ నిధులు కేటాయించాలని, విభజన చట్టంలో పేర్కొన్న హామీలు అమలు చేయాలని జైట్లీని కోరారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా, రాయితీలు అందించాలని విజ్ఞప్తి చేశారు. అనంతరం జగన్ మీడియాతో మాట్లాడుతూ, జైట్లీతో భేటీకి సంబంధించిన వివరాలు తెలిపారు.