: నిదానమే ప్రధానం... 21వ ఓవర్ లో 100కు చేరిన భారత స్కోర్
క్రికెట్ ప్రపంచకప్‌లో భాగంగా అడిలైడ్ వేదికగా భారత్, పాకిస్థాన్ మధ్య మ్యాచ్ కొనసాగుతున్న పోరులో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత జట్టు ఆచితూచి ఆడుతోంది. 20 ఓవర్లు ముగిసే సరికి 98 పరుగులు చేసిన జట్టు 21 ఓవర్ తొలి బంతికి 100 పరుగుల మైలురాయిని దాటింది. అంతకుముందు అఫ్రిది వేసిన 17వ ఓవర్లో కోహ్లి, ధావన్‌లు సింగిల్స్ ద్వారా 7 పరుగులు సాధించడం గమనార్హం. ప్రస్తుతం కోహ్లీ 42, ధావన్ 48 పరుగుల వద్ద నిలకడగా ఆడుతూ స్కోర్ పెంచుతున్నారు.