: ఎంత గట్టి జట్టునైనా ఓడిస్తాం... ఎంత చెత్త జట్టుతోనైనా ఓడిపోతాం!: పాక్ మాజీ అధ్యక్షుడు ముషార్రఫ్
"ప్రస్తుత పాక్ జట్టుకన్నా భారత్ అన్ని విధాలా మెరుగ్గా ఉంది. అయితే పాక్ జట్టు ఎంత పటిష్ట జట్టునైనా ఓడించగలదు. అలాగే ఎంత చెత్త టీమ్ చేతిలోనైనా ఓడగలదు’ అని పాకిస్తాన్ మాజీ అధ్యక్షుడు ముషార్రఫ్ అభిప్రాయపడ్డారు. ప్రపంచకప్ టోర్నీలోనే అత్యంత ఆసక్తికర మ్యాచ్ గా పేరు తెచ్చుకున్న భారత్, పాక్ జట్ల మధ్య మ్యాచ్ నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. భారత జట్టుకు శుభాకాంక్షలు తెలుపుతూ, కెప్టెన్ ధోనిని కొనియాడారు. ఈ మ్యాచ్ లో ధోని మెరుగ్గా ఆడాలని కోరుకుంటున్నట్టు తెలిపారు. అతడు దూకుడుగా ఆడితే చూడాలని అందరూ భావిస్తారని అన్నారు.