: విశ్వాస పరీక్షలో మల్లయోధుడిగా బరిలోకి దిగుతా: బీహార్ సీఎం మాంఝీ


బీహార్ అసెంబ్లీలో జరగనున్న బల పరీక్షలో మల్లయోధుడిగా బరిలోకి దిగుతానని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి జితన్ రామ్ మాంఝీ ప్రకటించారు. గెలుపోటములతో సంబంధం లేకుండా పోరాడతానని ఆయన పేర్కొన్నారు. బీహార్ సీఎంగా ఉన్న ఆయనను పదవి నుంచి దించి సీఎం పీఠాన్ని దక్కించుకునేందుకు జేడీయూ నేత నితీశ్ కుమార్ చేస్తున్న యత్నాలను మాంఝీ తిప్పికొట్టేందుకు రంగంలోకి దిగారు. గవర్నర్ తో పాటు రాష్ట్రపతిని కలిసిన ఆయన చివరకు పాట్నా హైకోర్టును కూడా ఆశ్రయించిన సంగతి తెలిసిందే. కోర్టు ఆదేశాలతో బల పరీక్షకు రంగం సిద్ధమైంది. మరి ఈ నెల 20న జరగనున్న విశ్వాస పరీక్షలో మాంఝీ గెలుస్తోరో, లేదో చూడాలి.

  • Loading...

More Telugu News