: కేజ్రీవాల్ ఏ శాఖనూ తీసుకోరు... ప్రజల సమస్యలను తెలుసుకోవడమే ఆయన పని: ఢిల్లీ డిప్యూటీ సీఎం
ఢిల్లీ ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టిన ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ తన వద్ద ఏ ఒక్క శాఖను ఉంచుకోరట. అన్ని శాఖలను మంత్రులకే అప్పజెప్పనున్న కేజ్రీవాల్, ఆయా శాఖల పనితీరుపై మాత్రం పర్యవేక్షణ చేస్తారని ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా చెప్పారు. ఢిల్లీ ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్న విద్యుత్, నీటి సరఫరా తదితరాలకు సంబంధించిన శాఖలను కేజ్రీవాల్ తనవద్దే ఉంచుకుంటారన్న ప్రచారంలో ఎలాంటి వాస్తవం లేదని ఆయన ప్రకటించారు. ప్రజలతో నిత్యం మమేకమయ్యే కేజ్రీవాల్ వారి సమస్యలను తెలుసుకుని, వాటి పరిష్కారం కోసం చేపట్టాల్సిన చర్యలను కేబినెట్ సహచరులకు సూచిస్తారని సిసోడియా తెలిపారు.