: ర్యాగింగ్ తట్టుకోలేక గోడదూకి 50 మంది పారిపోయారు


ర్యాగింగ్ భూతం జడలు విప్పడంతో 50 మంది జూనియర్ విద్యార్థులు గోడదూకి పారిపోయిన ఘటన బీహార్ లో చోటుచేసుకుంది. బీహార్ లోని షెయిక్ పురలోని నవోదయ విద్యాలయ పాఠశాల వసతి గృహంలో 50 మంది విద్యార్థులు జాయిన్ అయ్యారు. సీనియర్ల ర్యాగింగ్ తట్టుకోలేకపోయిన పదకొండో తరగతి చదువుతున్న 50 మంది విద్యార్థులు గత రాత్రి గోడదూకి పారిపోయారని సంబంధిత జిల్లా అధికారులు తెలిపారు. విషయం తెలుసుకున్న ప్రిన్సిపల్ కన్హయ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ సంఘటన అసెంబ్లీలో దుమారం రేపింది.

  • Loading...

More Telugu News