: ఢిల్లీ ఓటమి ప్రతి పార్టీకీ హెచ్చరిక: ఆప్ నేత, రచయిత కృష్ణ ప్రతాప్ సింగ్
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఓటమి ప్రతి పార్టీకి హెచ్చరికలాంటిదని ప్రముఖ భారతీయ నవలా రచయిత, ఆమ్ ఆద్మీ పార్టీ సభ్యుడు కృష్ణ ప్రతాప్ సింగ్ అభిప్రాయపడ్డారు. న్యూయార్క్ టైమ్స్ కు రాసిన కథనంలో ఆయన పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ హనీమూన్ యాత్రకు భారతీయ ఓటర్లు చరమగీతం పాడారని పేర్కొన్నారు. రాజకీయ పార్టీలు ప్రజలతో ఎలా వ్యవహరించాయో దానిని అనుసరించే ఫలితాలు వచ్చాయని ఆయన వ్యాఖ్యానించారు. ఈ విజయం శుభపరిణామమని అన్నారు. ఈ విజయం పార్టీ మొత్తానికి చెందుతుందని ఆయన అన్నారు. ఆప్ గెలుపు దేశ రాజకీయాల్లో కీలక మలుపని ఆయన వెల్లడించారు. క్షణం ఆలస్యం కాకుండా హామీలు అమలు చేయాలని ఆయన ఆప్ కు సూచించారు.