: మీరు వద్దు, మేము వద్దు... కేంద్రానికి అప్పగిద్దాం: సాగర్ భద్రతపై బాబు సలహా
నాగార్జున సాగర్ ప్రాజెక్టు వద్ద భవిష్యత్తులో ఎటువంటి ఉద్రిక్తతలు తలెత్తకుండా కేంద్ర బలగాలను మోహరించేలా చూద్దామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సూచించారు. ఈ ఉదయం గవర్నర్ ను కలిసిన ఆయన నీటి విడుదల విషయమై వాస్తవాలను వివరించారు. అనంతరం తెలంగాణ సీఎం కేసీఆర్ వచ్చిన తరువాత డ్యాం భద్రతను కేంద్రానికి అప్పగిద్దామని అన్నారు. అయితే, ఈ విషయంలో కేసీఆర్ స్పందన ఏంటో మాత్రం తెలియరాలేదు. నీటి సమస్యను మరింత వివాదం చేసుకోకుండా, సరిహద్దు సమస్యలు తలెత్తకుండా సామరస్య పూర్వక పరిష్కారాలు కనుగొనాలని గవర్నర్ నరసింహన్ ఇద్దరు ముఖ్యమంత్రులకూ సూచించినట్టు తెలిసింది.