: జైలుపై దాడిచేసి మరణశిక్ష పడ్డ తీవ్రవాదులను తప్పించిన ఆల్ ఖైదా


యెమెన్ లోని షాబ్వా ప్రావిన్స్ లోని జైలుపై ఆల్ ఖైదా తీవ్రవాదులు దాడిచేసి బందీలుగా ఉన్న ఆరుగురు ఖైదీలను విడిపించి, తమతో పాటు తీసుకువెళ్లారు. ఈ విషయాన్ని భద్రత దళానికి చెందిన ఉన్నతాధికారి ఒకరు నేడు వెల్లడించారు. ఈ ఖైదీలందరికీ మరణశిక్ష పడిందని తెలిపారు. సైనిక శిబిరంపై ఉగ్రవాదులు దాడి చేసిన మరుసటి రోజు ఈ ఘటన చోటు చేసుకోవడంతో స్థానికంగా తీవ్ర ఆందోళన నెలకొంది. కాగా, యెమెన్ లోని తమ రాయబార కార్యాలయాలను మూసివేస్తున్నట్లు సౌదీ అరేబియాతో పాటు పలుదేశాలు ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News