: లేని హక్కులను ఆశిస్తూ, ఆంధ్రా మమ్మల్ని బద్నాం చేస్తోంది: గవర్నర్ తో హరీష్ రావు
గవర్నర్ నరసింహన్ సమక్షంలో ఇద్దరు చంద్రుల భేటీకి ముందే తెలంగాణ నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావు ఈ ఉదయం పరిస్థితిని వివరించేందుకు రాజ్ భవన్ కు వచ్చారు. నాగార్జున సాగర్ జలాల విడుదల వివాదంపై తెలంగాణ ప్రభుత్వ వాదనను ఆయన ఈ సందర్భంగా గవర్నర్ కు వివరించినట్లు సమాచారం. నీటి వినియోగంలో ఆంధ్రప్రదేశ్ లేని హక్కుల కోసం ఆశపడుతోందని, తెలంగాణే తమకు అన్యాయం చేస్తోందన్న అపోహ సృష్టించేందుకు ప్రయత్నిస్తోందని మంత్రి హరీశ్ రావు ఆరోపించారు. తెలంగాణ ప్రభుత్వాన్ని బద్నాం చేసేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని గవర్నర్ కు చెప్పినట్టు తెలిసింది.