: శ్రీ అనంత పద్మనాభస్వామి గుడిలో 266 కిలోల బంగారం మాయం


ప్రపంచంలోనే అత్యంత ధనిక దేవుడిగా గుర్తింపు తెచ్చుకున్న తిరువనంతపురం అనంత పద్మనాభస్వామి దేవాలయంలో 266 కిలోల బంగారం కనిపించడం లేదట. ఈ విషయాన్ని తన ఆడిట్ నివేదికలో మాజీ కాగ్ చీఫ్ వినోద్ రాయ్ తెలిపారు. ఈ మేరకు ఆయన కోర్టుకు నివేదిక ఇచ్చారు. గత సంవత్సరంలో గుడి ఆదాయ వ్యయాలు, ఆస్తులు, స్వర్ణాభరణ వివరాలను గణించాలని సుప్రీంకోర్టు రాయ్ ని ఆదేశించిన సంగతి తెలిసిందే. అక్కడి భూగర్భ మాళిగల్లో లభించిన సంపద విలువ రూ.1 లక్ష కోట్లకు పైనే ఉంటుందని ఆయన తెలిపారు. ఇంకా 'బి' అని పేరు పెట్టిన గదిని తెరవాల్సి వుందని వివరించారు. వివిధ పనుల నిమిత్తం 893 కిలోల బంగారాన్ని దేవస్థానం ఇవ్వగా, కేవలం 627 కిలోలు మాత్రమే వెనక్కు వచ్చినట్టు రాయ్ తన నివేదికలో తెలిపారు. ఈ నివేదికపై ట్రావెన్ కోర్ రాజ కుటుంబం ఇంకా స్పందించలేదు.

  • Loading...

More Telugu News