: రింగ్ అయిన ల్యాండ్ ఫోన్ ఎత్తగానే మృత్యువు కాటేసింది
ఇప్పటివరకూ సెల్ ఫోన్లు షాక్ కొట్టి మరణించిన వారి గురించి విన్నాము. కానీ ఈ ఘటన ల్యాండ్ లైన్ ఫోనుకు సంబంధించినది. రింగ్ అవుతున్న ల్యాండ్ ఫోన్ ఎత్తగానే విద్యుదాఘాతానికి గురై ఓ వ్యక్తి మరణించిన ఘటన ప్రకాశం జిల్లా బొబ్బేపల్లిలో జరిగింది. గ్రామానికి చెందిన దండా మారుతీరావు (54) ఇంట్లో బీఎస్ఎన్ఎల్ ల్యాండ్ లైన్ ఫోన్ ఉంది. ఆ ఫోన్ మోగుతుండటంతో ఆయన ఫోన్ ఎత్తారు. ఆ వెంటనే కరెంటు షాక్ కు గురై తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందాడు. టెలిఫోన్ తీగల మీదగా విద్యుత్ తీగలు కూడా వ్యాపించి వుండటం, వాటికి టెలిఫోన్ వైరులోని రాగి తీగ తగలటంతో విద్యుత్ షాక్ కొట్టినట్టు తెలుస్తోంది. కేసునమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.