: నేను మోసగాడిగా మిగిలిపోయా... ఆ తప్పు మీరు చేయకండి: లూ విన్సెంట్


మాజీ క్రికెటర్ లూ విన్సెంట్ వరల్డ్ కప్ లో పాల్గొంటున్న క్రికెటర్లకు వీడియో సందేశమిచ్చాడు. తాను బుకీల ఉచ్చులో పడి మోసగాడిగా మిగిలిపోయానని లూ విన్సెంట్ ఆవేదన వ్యక్తం చేశాడు. తనలాగే బుకీల ఉచ్చులో పడి మోసగాళ్లు అనే ముద్ర వేయించుకోవద్దని పిలుపునిచ్చాడు. 14 దేశాల నుంచి ప్రపంచకప్ ఆడేందుకు వచ్చిన 200 మంది ప్రతినిధులకు ఆయన సందేశమిచ్చాడు. అవినీతిని అడ్డుకునేందుకు ఐసీసీ చర్యలు తీసుకున్నప్పటికీ ఏమరుపాటుతో ఆటగాళ్లు మర్చిపోయే ప్రమాదం ఉందని, అలా జరగకుండా ఉండేందుకు తాము వీడియో సందేశం ఇచ్చామని ఐసీసీ అధికారులు తెలిపారు. వరల్డ్ కప్ టోర్నమెంటును పారదర్శకంగా నిర్వహిస్తామని ఐసీసీ స్పష్టం చేసింది. ఆటగాళ్లతోపాటు, అంపైర్లు, గ్రౌండ్స్ మెన్, అధికారులు, జట్టుకు సేవలందించే అందరిమీదా నిఘా ఉంటుందని ఐసీసీ తెలిపింది.

  • Loading...

More Telugu News