: రాజకీయ ప్రయోజనాల కోసం రైతన్న కన్నీరు పెట్టాలా?: దేవినేని ఉమ
తెలంగాణ రైతు బాగుండాలని ఆంధ్రారైతు కోరుకుంటున్నాడని ఆంధ్రప్రదేశ్ మంత్రి దేవినేని ఉమ తెలిపారు. విజయవాడలో ఆయన మాట్లాడుతూ, బచావత్ ట్రైబ్యునల్ చేసిన వాటాల ప్రకారం నీటిని పంచుకోవడంపై అభ్యంతరం ఏంటని ప్రశ్నించారు. రైతన్న కంట నీరొలికితే రాష్ట్రం సుభిక్షంగా ఉండదని ఆయన స్పష్టం చేశారు. ఏ ప్రయోజనాల కోసం ఈ విద్వేషాలు రేపుతున్నారని ఆయన ప్రశ్నించారు. కృష్ణా జలాల పంపిణీ కోసం, బ్రజేష్ కుమార్ ట్రైబ్యునల్ కసరత్తు చేస్తోందని ఆయన తెలిపారు. ఉన్న నీటిని లెఫ్ట్ కెనాల్ కు ఎంత? రైట్ కెనాల్ కు ఎంత? కృష్ణా డెల్టాకు ఎంత నీటిని విడుదల చేయాలో ఆలోచించాలని ఆయన సూచించారు. అలా కాదని మూర్ఖపు ఆలోచనలు చేయడం సరికాదని ఆయన హితవు పలికారు. రాజకీయ ప్రయోజనాల కోసం రైతన్న అన్యాయం కాకూడదని ఆయన పేర్కొన్నారు. నేతలపై రాజకీయ కక్షలను ప్రజలపై తీర్చుకుంటారా? అని ఆయన నిలదీశారు.