: శ్రీవారి పాదాల చెంత 'సంపూర్ణ భగవద్గీత' ఆడియో తొలి ప్రతి
'సంపూర్ణ భగవద్గీత' పేరుతో రూపొందించిన పాటల ఆడియో తొలి సీడీని తిరుమల శ్రీవారి పాదాల చెంత ఉంచారు. భగవద్గీత ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు, సంగీత దర్శకుడు గంగాధర శాస్త్రి ఈ ఆడియోను రూపొందించారు. ఈ సందర్భంగా ఆడియో మొదటి ప్రతిని వెంకన్న పాదాల వద్ద ఉంచి ఆశీర్వాదం తీసుకున్నారు. 'భగవద్గీత'లో ఉన్న 700 శ్లోకాలను తాత్పర్య సహితంగా రికార్డ్ చేసి భక్తులకు ఈ ఆడియోలో అందించారు. దానిని రూపొందించేందుకు తమకు అమరగాయకుడు ఘంటసాల స్పూర్తి అని గంగాధర శాస్త్రి తెలిపారు. ఏప్రిల్ చివరిలో ఈ ఆడియో విడుదలవుతుందని చెప్పారు.