: డ్రైవర్ తప్పతాగిన కారణంగానే... ‘నూతక్కి’ స్కూల్ బస్సు ప్రమాదం


గుంటూరు జిల్లా మంగళగిరి మండలం నూతక్కి వద్ద నేటి ఉదయం జరగిన స్కూలు బస్సు ప్రమాదానికి సంబంధించి బస్సు డ్రైవర్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బస్సు నడుపుతున్న సమయంలో డ్రైవర్ పరమేశ్వరరావు తప్పతాగి ఉన్నాడని స్థానికులు చెబుతున్నారు. అయితే, యాక్సిల్ విరిగిపోవడంతోనే బస్సు కాలువలోకి దూసుకెళ్లిందన్న మరో వాదన వినిపిస్తోంది. విద్యార్థులను పాఠశాలకు తరలిస్తున్న క్రమంలో విజ్ఞాన్ విహార్ స్కూలు బస్సు నేటి ఉదయం కాలువలోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో రెండో తరగతి చదువుతున్న ఏడేళ్ల చిన్నారి లహరి చనిపోగా, నలుగురు విద్యార్థులకు తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాదం నేపథ్యంలో పాఠశాల నిర్లక్ష్య వైఖరిని నిరిసిస్తూ విద్యార్థుల తల్లిదండ్రులు, గ్రామస్థులు పాఠశాల ముందు ఆందోళనకు దిగారు.

  • Loading...

More Telugu News