: విశాఖలో బీఎస్ఎఫ్ బెటాలియన్ ఏర్పాటుకు కేంద్రం అంగీకారం


మావోయిస్టు కార్యకలాపాలను నివారించేందుకు విశాఖపట్నంలో సరిహద్దు భద్రతా దళం బెటాలియన్ ను ఏర్పాటు చేసేందుకు కేంద్ర హోంమంత్రిత్వశాఖ అంగీకరించింది. ప్రస్తుతం బలిమెలలో ఉన్న భద్రతాదళం మావోయిస్టు కార్యకలాపాలపై హెలికాప్టర్ల ద్వారా నిఘా ఉంచుతూ, నివారణకు చర్యలు తీసుకుంటోంది. తాజాగా, మావోయిస్టులు ఉత్తరాంధ్రవైపు దృష్టి సారించి... విశాఖ దిశగా కార్యకలాపాలకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో, ఏపీ ప్రభుత్వ సీఎస్ ఐవైఆర్ కృష్ణారావు, డీజీపీ జేవీ రాముడు ఇటీవలి ఢిల్లీ పర్యటనలో కేంద్ర హోంశాఖ కార్యదర్శి ఎల్.సి.గోయల్ ను కలిశారు. విశాఖ వైపు కూడా సరిహద్దు భద్రతాదళం బెటాలియన్ ఏర్పాటు చేయాలని, మావోల కదలికలపై నిఘా ఉంచాలని కోరగా, అందుకు ఆయన వెంటనే అనుమతి తెలిపారు.

  • Loading...

More Telugu News