: నలుగురి మధ్యన తిట్టుకోవడం ఆపండి... కాంగ్రెస్ నేతలకు సోనియా హితవు


ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయం తరువాత, కాంగ్రెస్ పార్టీ నేతలు బహిరంగంగా ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటుంటే, వాటిని ఆపేందుకు స్వయంగా సోనియా గాంధీ రంగంలోకి దిగారు. ఆ పార్టీ ఢిల్లీ ఇంచార్జ్ గా ఉన్న పీసీ చాకోతో జరిపిన సమావేశంలో సోనియా కాస్త గట్టిగానే కోప్పడినట్టు తెలిసింది. మీడియా ముందు తిట్టుకొని ప్రజల ముందు చులకన కావద్దని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. ఢిల్లీ ఎన్నికల్లో ఒక్కటంటే ఒక్క సీటు కూడా గెలవడంలో విఫలమైన కారణాలను చాకో ఈ సమావేశంలో సోనియాకు వివరించారు. ఓటమి తరువాత ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్, ఆ పార్టీ ముఖ్యమంత్రి అభ్యర్థి అజయ్ మాకెన్ ల మధ్య మాటల యుద్ధం జరుగుతున్న సంగతి తెలిసిందే. దీన్ని ప్రస్తావించిన సోనియా సంయమనంతో నడచుకోవాలని నేతలకు సూచించినట్టు సమాచారం.

  • Loading...

More Telugu News