: మార్చి 4న మంచు మనోజ్ నిశ్చితార్థం


టాలీవుడ్ సీనియర్ నటుడు డాక్టర్ మోహన్ బాబు చిన్న కుమారుడు మంచు మనోజ్ నిశ్చితార్థం మార్చి 4న హైదరాబాదులో జరగనుంది. తన దీర్ఘకాల స్నేహితురాలు ప్రణతి రెడ్డితో మనోజ్ వివాహానికి పెద్దలు అంగీకరించిన సంగతి తెలిసిందే. ఈ నిశ్చితార్థం మార్చి 4న ఓ స్టార్ హోటల్లో ఉదయం 10.30 గంటలకు జరగనుండగా, టాలీవుడ్లోని నటీనటులు, ప్రముఖ రాజకీయ నాయకులను ఈ వేడుకకు ఆహ్వానిస్తున్నట్టు సమాచారం. పూర్తి తెలుగు సంప్రదాయ పద్ధతుల్లోనే ఈ వేడుక చేయాలని రెండు కుటుంబాలు నిర్ణయించుకున్నట్టు మంచు మనోజ్ మిత్రుడొకరు వివరించారు. మొదట మనోజ్ ఇంట్లో పూజ నిర్వహించి ఆపై హోటల్ లో ఉంగరాలు మార్చుకుంటారని ఆయన తెలిపారు. కాగా, బిట్స్ పిలానిలో మెకానికల్ ఇంజనీరింగ్ పూర్తి చేసిన ప్రణతి రెడ్డి, మంచు విష్ణు భార్య విరోనికాకు క్లాస్మేట్.

  • Loading...

More Telugu News