: కొత్తకొప్పెర్ల జాతరలో జనం, పోలీసుల మధ్య ఘర్షణ... వ్యక్తి ఆత్మహత్యతో పరిస్థితి ఉద్రిక్తం
విజయనగరం జిల్లా పూసపాటిరేగ మండలం కొత్తకొప్పెర్లలో జరుగుతున్న పార్వతమ్మ జాతరలో పోలీసులతో జనం ఘర్షణకు దిగారు. ఈ క్రమంలో గ్రామానికి చెందిన మల్లేశ్ అనే వ్యక్తి చనిపోయాడు. తనపై పోలీసులు అకారణంగా దాడికి దిగారన్న మనస్తాపంతోనే మల్లేశ్ ఆత్మహత్య చేసుకున్నాడని గ్రామస్థులు ఆరోపిస్తున్నారు. మల్లేశ్ మృతదేహంతో గ్రామస్తులు పూసపాటిరేగ పోలీస్ స్టేషన్ ముందు ఆందోళనకు దిగారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. జాతరలో పోలీసులు, జనం మధ్య ఘర్షణకు దారి తీసిన కారణాలు తెలియరాలేదు.