: ఏపీ హైకోర్టును కర్నూలులో ఏర్పాటు చేయండి... కేంద్రాన్ని కోరిన ఎంపీ బుట్టా రేణుక
ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఏర్పాటు విషయంపై ఎంపీ బుట్టా రేణుక కేంద్ర న్యాయశాఖ మంత్రి సదానంద గౌడను కలిశారు. రాష్ట్ర హైకోర్టును కర్నూలు జిల్లాలో ఏర్పాటు చేయాలని కోరారు. ఈ సందర్భంగా ఆమె మంత్రికి ఓ వినతిపత్రాన్ని సమర్పించారు. అనంతరం రేణుక మీడియాతో మాట్లాడుతూ, హైకోర్టు ఏర్పాటు విషయంపై మంత్రికి విన్నపం చేసినట్టు తెలిపారు. భవిష్యత్ లో మరో రాయలసీమ ఉద్యమం రాకుండా ఉండాలంటూ కర్నూల్ లో రెండవ రాజధానిని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఇదిలా ఉంటే ప్రత్యేక హైకోర్టు కోసం తెలంగాణ న్యాయవాదులు ఇప్పటికే డిమాండ్ చేస్తున్న సంగతి విదితమే.