: వివాదంలో 'బాహుబలి' సినిమా... ఓ కులాన్ని కించపరిచే సీన్లున్నాయా?


ప్రభాస్-రాజమౌళి కాంబినేషన్లో ప్రతిష్ఠాత్మక రీతిలో రూపుదిద్దుకుంటున్న 'బాహుబలి' చిత్రం ఓ వివాదంలో చిక్కుకుంది. ఇటీవల ఈ సినిమాకు చెందిన కొన్ని సీన్లు లీకవడం తెలిసిందే. ఆ సీన్లలో తమ కులస్తులను కించపరిచేలా సీన్లు ఉన్నాయని మాలల సంక్షేమ సంఘం అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ క్రమంలో మాలల సంక్షేమ సంఘం హైదరాబాదు సీసీఎస్ లో ఫిర్యాదు చేసింది. ఫిర్యాదు అందుకున్న సీసీఎస్ పోలీసులు ఈ వ్యవహారంపై దృష్టి పెడతామని తెలిపారు. ఇటీవల సినిమాకు సంబంధించిన సీన్లను లీక్ చేసిన వారే ఆ అభ్యంతరకర సన్నివేశాలను సృష్టించారా? లేక, ఆ సీన్లు సినిమాలోనే ఉన్నాయా? అన్న కోణంలో ముందుకెళతామని పోలీసులు పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News