: ఉత్తరాంద్ర జిల్లాల్లో చంద్రబాబు పర్యటన... ముందుగా విజయనగరం వెళ్లిన సీఎం
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నేటి నుంచి ఉత్తరాంధ్ర జిల్లాల్లో పర్యటిస్తున్నారు. ఈ క్రమంలో ముందుగా ఆయన విజయనగరం జిల్లా చీపురుపల్లి చేరుకున్నారు. అక్కడ స్థానిక మంత్రులు, టీడీపీ నేతలు హెలిపాడ్ వద్ద బాబుకు ఘన స్వాగతం పలికారు. అక్కడి కనకమహాలక్ష్మీ దేవాలయానికి చేరుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం జీవీఆర్ కళాశాలలో నిర్వహించే బహిరంగ సభలో సీఎం పాల్గొంటారు. అంతకుముందు చంద్రబాబు, టీడీపీ కార్యకర్తల సంక్షేమనిధి సమన్వయకర్త లోకేశ్, పలువురు మంత్రులు శ్రీకాకుళం జిల్లా రేగడి చేరుకున్నారు. అక్కడ పార్టీ సీనియర్ నేత కళా వెంకట్రావు కుమారుడి వివాహానికి హాజరై వధూవరులను ఆశీర్వదించారు.